Andhra Pradesh
ఆహార కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు

నంద్యాల పల్లెవాణి: వినియోగదారులకు అందిస్తున్న ఆహార పదార్థాల్లో కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్సేఫ్టీ ఇన్స్పెక్టర్ వెంకటరాముడు హెచ్చరించారు. ఆహార భద్రతపై స్థానిక కార్యాలయంలో మంగళవారం పట్టణ హోటల్స్, రెస్టారెంట్లు, బేకరిల నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆహార భద్రత ప్రమాణాల చట్టం 2026 ప్రకారం ఆహార పదార్థాల్లో కల్తీని నివారించాలన్నారు. పరిశుభ్రత పాటిస్తూ నాణ్యమైన ఆహారాన్ని వినియోగదారులకు అందించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని యజమానులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫుడ్సేఫ్టీ అధికారి కాశీం వలి, తదితరులు పాల్గొన్నారు.



