Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Kadapa

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో 24 న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం.

కడప జిల్లా, ఒంటిమిట్ట : తిరుపతి తిరుమల దేవస్థాన పిఆర్ఓ. నీలిమ. నేడు బుధవారం పత్రిక ప్రకటన లో మీడియా కు తెలుపుతు శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 24వ తేదీన‌ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించబడుతుందని,
ఆలయంలో మార్చి 26 నుండి ఏప్రిల్ 05వ తేదీ వ‌ర‌కు బ్ర‌హ్మోత్స‌వాలు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీనని,ఈ సందర్భంగా మార్చి 24న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలుపుతారన్నారు.
అనంతరం ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగనుందని,ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారని,అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారన్నారు.మార్చి 25న పసుపు దంచే కార్యక్రమం మరియు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 25న ఉదయం పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. మార్చి 27న ప్రారంభము కానున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 01వ తేదీ అత్యంత వైభవంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణంలో ఈ పసుపును వినియోగించనున్నరన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button