Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Kadapa

ఒంటిమిట్ట శ్రీరాముని కళ్యాణమునకు అదనపు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు….. ఆర్టీసీ డిఆర్ఓ

కడప జిల్లా : కడప జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి గోపాల్ రెడ్డి పత్రిక ప్రకటన లో మాట్లాడుతు …. ఏప్రిల్ 01 వ తేది బుధవారం న్నాడు ఒంటిమిట్టలో జరుగనున్న శ్రీ కోదండరామ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా,కడప జిల్లా నలుమూలల నుండి వచ్చే భక్తాదుల కోసం ప్రత్యేక బస్సులు నడపబడనున్నవని, వాటి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
“కడప – 35,,పులివెందుల – 12,,బద్వేల్ – 22,,జమ్మలమడుగు – 12,,
ప్రొద్దుటూరు – 07,,
రాజంపేట & రాయచోటి – 17,,ఇతర ప్రాంతాలు – 40,,మొత్తం – 145 బస్సులను నడుపుతున్నామన్నారు.
“అదనంగా, భక్తుల సౌకర్యార్థం….కడప వైపు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం నుండి కళ్యాణోత్సవం జరిగే ప్రదేశం వరకు 12 ఉచిత బస్సులు,
రాజంపేట వైపు సాలాబాద్ క్రాస్ పార్కింగ్ స్థలం నుండి కళ్యాణోత్సవం ప్రదేశం వరకు 08 ఉచిత బస్సులు
మొత్తం 20 ఉచిత బస్సులు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరియు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్యంతో నడపబడనున్నవన్నారు.
ఇంకా, పక్క జిల్లాలైన అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విజయవాడ, విశాఖపట్నం మరియు హైదరాబాద్ ప్రాంతాల నుండి కూడా భక్తులు హాజరయ్యే దృష్ట్యా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయబడ్డ యన్నారు.
01.04.2026 న ఉదయం 07:00 గంటల నుండి రాజంపేట మరియు కడప వైపుల నుండి ప్రత్యేక బస్సులు నడపబడుతయాని,
కళ్యాణోత్సవం ముగిసిన అనంతరం కూడా తిరుగు ప్రయాణానికి బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు.
రాజంపేట & తిరుపతి వైపు వెళ్ళే భక్తులకు: సాలాబాద్ క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం నుండి కడప వైపు వెళ్ళే భక్తులకు: గరుడ హోటల్ పక్కన ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం నుండిరాత్రి 03:00 గంటల వరకు భక్తులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చుటకు ప్రత్యేక బస్సులు నడపబడుతయాని,
కాబట్టి, కడప మరియు ఇతర జిల్లాల భక్తాదులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి కళ్యాణోత్సవానికి హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button