కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివ రావు మరణం పట్ల కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ సంతాపం

కామవరపుకోట : మాజీ మంత్రి కావూరి సాంబశివ రావు మరణం పట్ల కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ తరఫున మండల అధ్యక్షులు కిలారు సత్యనారాయణ తీవ్ర సంతాపం ప్రకటించారు. కావూరు ఏలూరు ఎంపీగా పనిచేసిన కాలంలో ఆయనతో గడిపిన స్మృతులు గుర్తు చేసుకున్నారు.ప్రజా సేవారంగం లో అంకిత భావంతో పనిచేసిన గొప్ప నాయకుడిని కోల్పోవటం అత్యంత బాధాకరం అన్నారు.ప్రోగ్రసీవ్ కన్ స్ట్రక్షన్స్ సంస్థ ను స్థాపించి వేలాది మందికి ఉపాధి చూపారని ,కావూరి ఫౌండేషన్ ద్వారా లక్ష మందికి పైగా యువతకు టైపు,కంప్యూటర్ విద్య లో ఉచిత శిక్షణ ఇచ్చారని,జనశిక్షణ సంస్థాన్ ద్వారా 50 వేల మంది మహిళలకు టైలరింగ్ ఎంబ్రాయిడరీ లో ఉచిత శిక్షణ ఇచ్చారని ఆయన తెలిపారు. ఐదు సార్లు ఎంపీగా గెలుపొందిన సీనియర్ పార్లమెంటేరియన్ గా పార్లమెంట్ లో సమర్ధవంతంగా తన గళం వినిపించారని అన్నారు. ఏలూరు మచిలీపట్నం ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలు మరువలేనిమన్నారు.పేద,గొప్ప అనే తారతమ్యం లేకుండా అందరినీ సమానంగా చూసిన గొప్ప నాయకుడు కావూరి సాంబశివరావు అని నివాళులర్పించారు. కావూరికి సంతాపం ప్రకటించిన వారు మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, కిలారు సత్యనారాయణ, జుజ్జురి బాబ్జి, గూడపాటి కేశవరావు, కంఠమనేని సత్యనారాయణ, తూతా లక్ష్మణరావు, బొప్పన అంజయ్య, గోరింక దాసు, అబ్బూరి సాయి కృష్ణ, గంటా మాధవరావు, తూతా బాలాజీ కుమార్, గూడపాటి మధు, ఎస్ ఆర్ ఆర్ సూర్యనారాయణ రాజు తదితరులు ఉన్నారు.



