తెలంగాణ మోడల్ స్కూల్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.

మహబూబాబాద్ జిల్లా మార్చి 10: ప్రతిష్టాత్మకంగా చేపట్టి నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందనీ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.మంగళవారం నరసింహలపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలతో స్వయంగా మాట్లాడారు.99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రజలకు క్షేత్రస్థాయిలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, సానిటేషన్, ఫైళ్ళ క్లియరెన్స్, కార్యాలయాల పరిసరాల పరిశుభ్రత లపై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లా వ్యాప్తంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు,
తెలంగాణ మోడల్ స్కూల్ నరసింహలపేటలో పిల్లల అందిస్తున్న సౌకర్యాలు, విద్య బోధనలపై పిల్లలతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న కామన్ డైట్ మెనూను పకడ్బందీగా అమలు చేయాలని, పిల్లలు ఆరోగ్యంగా ఉంటే చదువుపై దృష్టి సారించి ముందుకు వెళ్తాన్నారు, సబ్జెక్టుల వారిగా పిల్లల విద్యా సామర్ధ్యాలను పరిశీలించాలని వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తమ విద్యా బోధనలు అందించాలని తెలిపారు.ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థుల హాజరు వివరాలను పరిశీలించారు, రానున్న పరీక్షల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం ఏర్పాట్లు చేయాలని, సంబంధిత సిబ్బందికి సూచించారు.జిల్లావ్యాప్తంగా గురువారం జిల్లా స్థాయి అధికారులు అన్ని వసతి గృహాల తనిఖీలు పిల్లలతో కలిసి బ్రేక్ ఫాస్ట్, భోజనం చేసి వారికి అందుతున్న సౌకర్యాలను పరిశీలించి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించడం జరుగుతుందనీ అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి దేశీ రామ్ నాయక్, గిరిజన ఆశ్రమ పాఠశాల మహబూబాబాద్, ఆశ్రమ హై స్కూల్, మహాత్మ జ్యోతిరావు పూలే స్కూల్ దంతాలపల్లి,
డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, కురవి ఐకెపి సెంటర్ లో క్లీనింగ్ అండ్ సానిటేషన్ పనులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు.
జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ జూనియర్ కాలేజ్, మరిపెడ,
జిల్లా హార్టికల్చర్ అధికారి జి.మరియాన్న నెల్లికుదురు మండలం కస్తూరిబా గాంధీ విద్యాలయం, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసరావు, గూడూరు మండలం దామారవంచ, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్,
ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాసరావు, మహబూబాబాద్ పట్టణంలోని మైనారిటీ రెసిడెన్షియల్ హై స్కూల్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భీమ్లా నాయక్, ఎస్సీ ఎస్టీ హాస్టల్ చిన్న గూడూరు,
జిల్లా పరిషత్ సీఈవో పురుషోత్తం, మరిపెడ ఎంపీడీవో కార్యాలయం తనిఖీ చేసి సానిటేషన్, ఫైల్ క్లియరెన్స్ చేయించారు.సివిల్ సప్లై డిఎం ఎస్సీ హాస్టల్ ఇనుగుర్తి, వెల్ఫేర్ అధికారిని సబిత ఆశ్రమ హై స్కూల్ కురవి, ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా విజయ ఆశ్రమ హైస్కూల్ మహబూబాబాద్, అగ్రికల్చర్ అధికారి, తదితరులు వారికి కేటాయించిన వసతి గృహాలలో తనిఖీ చేసి నివేదికలు అందించారు.



