Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra Pradesh

పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరూ ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంతమైన చిత్తంతో పరీక్షలు రాయాలి

ఏలూరు జిల్లా కొయ్యలగూడెం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరూ ఎటువంటి ఒత్తిడికి లోనుకాకుండా, ప్రశాంతమైన చిత్తంతో పరీక్షలు రాయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి గారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థుల జీవితంలో పదో తరగతి అనేది ఒక కీలకమైన మైలురాయి అని పేర్కొన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పోషకాహారం తీసుకోవడం ద్వారా ఏకాగ్రతను పెంచుకోవచ్చని ఆమె సూచించారు.
పట్టుదలతో చదివిన అంశాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి.
​అలాగే పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకుని, ప్రశాంతంగా సమాధానాలు గుర్తించాలి.
ఈ సమయంలో పిల్లలకు మానసిక ధైర్యాన్ని అందిస్తూ, వారికి అనువైన వాతావరణాన్ని కల్పించాలని తల్లిదండ్రులను కోరారు. రాష్ట్రంలోని విద్యార్థులందరూ ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులై, ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలని ఆమె మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button