Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra PradeshCrimePolitical

ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేసిన టీడీపీ పార్టీ కార్యకర్త.. సర్పంచ్ అకేపాటి

తిరుపతి జిల్లా : రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం లో నేడు సోమవారం పుల్లంపేట సర్పంచ్ అకేపాటి శ్రీనివాసులు రెడ్డి పత్రిక ప్రకటన లో మాట్లాడుతు…. పుల్లంపేట పంచాయతీ ఉడుమువారిపల్లి గ్రామానికి చెందిన గడ్డం సురేంద్ర రెడ్డి పుల్లంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో స్టాంపులు వ్రాసుకుంటు జీవనం సాగిస్తున్నాడు.
గడ్డం సురేంద్ర రెడ్డి కి సంబందించి బైపాస్ రోడ్లో పంచాయతీ అనుమతి ( అప్రూవల్ ) లేకుండా గతం లో నాలుగు రూములు నిర్మించాడు, ఇప్పుడు పంచాయతీ “అప్రూవల్” లేకుండా మల్లి రెండు రూములు నిర్మిస్తున్నాడు. గత రాత్రి ఆదివారం సురేంద్ర రెడ్డి తన రూముల పక్కన పంచాయతీ అనుమతి లేకుండా పంచాయతీ నిధులతో నిర్మించిన పైప్ లైన్ ను పగలకొట్టి మరియు పంచాయతీ కి సంబందించిన స్థలాన్ని కబ్జా చేసి గాడి గుంతలు తీసేడు. గుంతలు తీయడం వలన పంచాయతీ పైప్ లైన్ మరియు పంచాయతీ రోడ్ రెండు దెబ్బతిన్నాయని, గుంతలు తీయడం వలన పంచాయతీ కి సంబందించిన పైప్ లైన్ దెబ్బతిని పుల్లంపేట ప్రజలకు త్రాగునీళ్ల సమస్య వచ్చిందన్నారు. అయ్యా…. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మరియు జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు లు స్పందించి, పంచాయతీ అనుమతి లేకుండా రూములు కట్టి మరియు పంచాయతీ స్థలాన్ని కబ్జా చేసి మరియు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన పంచాయతీ పైప్ లైన్ ను లికేజి చేసిన గడ్డం సురేంద్ర రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ పైప్ లైన్ లికేజి మరియు పంచాయతీ కి సంబందించిన ప్రభుత్వ భూమి కబ్జా చేసిన గడ్డం సురేంద్ర రెడ్డి పై పుల్లంపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసేమన్నారు.
ఈ కార్యక్రమంలో…. పంచాయతీ సెక్రటరీ యస్. జనార్దన్ లు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button