ముత్యాలమ్మ జాతరకు పక్కడ్బెందిగ బందోబస్తు…. జిల్లా ఏస్పీ అజిత వేజండ్ల.

నెల్లూరు : నెల్లూరు జిల్లా, గూడూరు రూరల్, చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులో సోమ, మంగళ, బుధ, గురువారాలు, మూడు రోజులు జరుగుతున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్బంగా, జిల్లా ఏస్పీ డా. అజిత వేజండ్ల ఐపీస్ చిల్లకూరు పరిధిలోని ముత్యాలమ్మ అమ్మవారిని సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో అవుట్ పోస్ట్, కంట్రోల్ రూమ్ ఏర్పాటు,బారికేడింగ్, క్యూ లైన్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ పాయింట్ల వద్ద భక్తుల రద్దీకి అనుగుణంగా సమగ్ర బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. అలాగే దేవాదాయ శాఖతో పాటు ఇతర సంబంధిత శాఖల సమన్వయంతో జంతు వధ జరగకుండా చర్యలు తీసుకోవాలని,
సుమారు 5 లక్షలు వరకు తరలి రానున్న భక్తులకు
ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. తోపులాటలు, తొక్కిసలాటకు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, “క్య్ ఆర్ టీ” టీమ్స్, మొబైల్ పెట్రోలింగ్,
కంటిన్జెన్స్ ప్లాన్, మెడికల్ ఎమర్జెన్సీ పక్కాగా ఉండాలన్నారు. భక్తులు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపివేయాలని సూచించారు.
నేర నియంత్రణ దృష్ట్యా “సీసీస్ ” ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, లైటింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు మరియు పెట్రోలింగ్ టీమ్స్ అలెర్ట్ గా ఉండలని అలాగే డ్రోన్ సర్వ్ లెన్స్ సీసీటీవీ కవరేజ్ పరిధి పెంచాలని, గాంబ్లీంగ్, డైమాండ్ డబ్బా నిషేదించాలని, సిలికా మైనింగ్ పిట్స్ వద్ద రెడ్ ఫ్లాగ్స్ పెట్టి మెన్ పోస్టింగ్ చేయలన్నారు. బందోబస్తు నిమితం ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందికి ఏర్పాట్లు చేయాలని అధికారులకి సూచించారు. జిల్లా పోలీసు శాఖ భక్తులకు సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో దర్శనాలు జరగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలన్నారు.



