Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra Pradesh

మొక్కలు తోనే మానవాళి మనుగడ

జీలుగుమిల్లి – మానవాళి మనుగడ ప్రకృతి తో ముడి పడి ఉందని ముఖ్యంగా మొక్కలు మన జీవనశైలి ని క్రమ బద్దీకరిస్తాయని ఆయుష్ ను పెంచుతాయని తెలుగు దేశం పార్టీ నాయకురాలు, దివంగత పోలవరం శాసన సభ్యుడు పూనెం సింగన్న దొర కోడలు పూనెం శశి కళ అన్నారు. జీలుగుమిల్లి మండలం పి అంకంపాలెం లో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమం లో ఆమె పాల్గొన్నారు. గ్రామ సచివాలయం లో సిబ్బంది తో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సారధ్యంలో కూటమి ప్రభుత్వం అహర్నిశలు ఆరాట పడుతున్నా రన్నారు.అందులో భాగంగా రైతు భరోసా అందరు రైతులకు అందించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రైతు కుటుంబం నుండి వచ్చిన తాను
రైతుల ఇబ్బందులు తెలిసి మాట్లాడుతున్నానని ముఖ్య మంత్రి ప్రతి రైతును ఆడుకోవాలని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తన హామీ ప్రకారం భరోసా మొత్తం వారి ఖాతాల్లో వేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.ఏజెన్సీ ప్రాంతం లో రైతులు పండించే అన్ని పంటలకు గిట్టుబాటు ధర అందించిన ఘనత కూటమి పాలకులదని శశి కళ కృతజ్ఞతలుచెప్పారు. గత సీజన్ లో వర్జీనియా పొగాకు పంటకు చరిత్ర లోరాని విధంగా క్వింటా కు రూ 4000/-రేటు రావడం గొప్ప అన్నారు. ఈ ఏడాది కూడా అదే రేట్ వస్తుందని ధీమా గా చెప్పారు. అలాగే పామాయిల్ గెలలధర బావుందని అన్నారు.
కూటమి పాలన లో ప్రజలు సంతృప్తి గా సంతోషం తో ఉన్నారని తెలిపారు. అలాగే గత ప్రభుత్వం లో కనీసం నడిచే పరిస్థితి కూడా లేని ఏజెన్సీ రోడ్లు అద్దం లా మెరుస్తూ అభివృద్ధికి చిహ్నంగా వున్నాయన్నారు.కార్యక్రమం లో సచివాలయం సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button