“యస్ యస్ సి” పరీక్షలకు పకడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు…. జిల్లా ఏస్పీ.

మదనపల్లి జిల్లా,మదనపల్లి: జిల్లాలో సోమవారం మార్చి 16 వ తేది నుండి ఏప్రిల్ 4 వ తేది వరకు ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి ఆటంకాలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినమని నేడు ఆదివారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు.
పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించి, బందోబస్తుపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా ఏస్పీ మాట్లాడుతు….. జిల్లాలోని 88 కేంద్రాలలో ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నయని, గతంలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.
అలాగే పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతిస్తారని, విద్యార్థినుల కోసం మహిళా పోలీసులను నియమించమన్నారు.
“సెల్‌ఫోన్లు నిషిద్ధం….స్మార్ట్ ఫోన్లు, బ్లూటూత్, స్మార్ట్ వాచ్‌లను లోపలికి అనుమతించమని, పరీక్షా విధులు నిర్వహించే సిబ్బంది మరియు బందోబస్తు పోలీసులు సైతం తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసి ప్రవేశ ద్వారం వద్దే డిపాజిట్ చేయాలన్నారు.
“144 సెక్షన్ అమలు…..కేంద్రం చుట్టూ 144 సెక్షన్ అమలులో ఉంటుందని, అనధికార వ్యక్తులు, తల్లిదండ్రులు గుమిగూడటం నిషేధమన్నారు.
“జిరాక్స్ సెంటర్ల మూసివేత….పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని అన్ని జిరాక్స్ సెంటర్లు పరీక్షలు ముగిసే వరకు మూసివేయాలని ఆదేశించమన్నారు.
“సున్నిత కేంద్రాలపై ప్రత్యేక దృష్టి….. సమస్యాత్మక కేంద్రాల వద్ద అదనపు పోలీసు బలగాలను (ఒక హెడ్ కానిస్టేబుల్ నలుగురు కానిస్టేబుళ్లు) ఏర్పాటు చేసేమని, మొబైల్ స్క్వాడ్లు నిరంతరం పర్యవేక్షిస్తాయన్నారు.
“కఠిన చర్యలు….సామాజిక మాధ్యమాలలో తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని, ఇతర అక్రమాలకు సహకరించే వారిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విద్యార్థులు ఎటువంటి ఒత్తిడి లేకుండా, ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించి, చదువు చెప్పిన గురువులకు, తల్లిదండ్రులకు మరియు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.



