Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra Pradesh

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన నంద్యాల జిల్లా చదరంగం జట్టు

నంద్యాల పల్లెవాణి: నంద్యాల జిల్లా చెస్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పాలిటెక్నిక్ కళాశాల జింకా ఆడిటోరియం లో నిర్వహించిన 15 సంవత్సరాల లోపు బాల,బాలికల నంద్యాల జిల్లా చదరంగం జట్ల ఎంపిక పోటీలలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్రస్థాయి పోటీలలో జిల్లా జట్టు తరుపున పాల్గొనడానికి ఎంపికయ్యారు. బాలుర విభాగంలో మొదటి స్థానం శివ కార్తికేయ,రెండవ స్థానం హర్షిత్,మూడో స్థానం రషీద్ మహమ్మద్,నాలుగవ స్థానం భువన కార్తికేయ సాధించి బహుమతులు అందుకున్నారు.బాలికల విభాగంలో మొదటి స్థానం వెంకట దీక్ష శ్రీ, రెండవ స్థానం పద్మ నాగ నిఖిల,తృతీయ స్థానం ఆశ్రిత భారతి,నాలుగవ స్థానం తపస్య సాధించి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,ప్రధాన కార్యదర్శి జి.రామ సుబ్బారెడ్డి మాట్లాడుతూ జూన్ నెలలో గుడివాడలో జరగనున్న రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో ఎంపికైన జట్లు నంద్యాల జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. గెలిచినవారు భవిష్యత్తు టోర్నమెంట్ లలో మళ్లీ గెలవడానికి, విజయం సాధించని వారు తదుపరి పోటీలలో విజయం సాధించడానికి క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన అవసరమని అన్నారు.జిల్లా జట్టుకు ఎంపికైన వారు కాకుండా వివిధ విభాగాలలో ప్రథమ,ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన క్రీడాకారులకు ట్రోఫీలు, పతకాలు అందజేశారు. ఈ బహుమతి ప్రధానోత్సవం లో డాక్టర్ రవి కృష్ణ తో పాటు జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామసుబ్బారెడ్డి,ప్రకాశం డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండారెడ్డి,ఎన్ ఆర్ జి అకాడమీ వైస్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి ఆర్బిటర్ సుజాత, క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button