Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Telangana

వన్యప్రాణులు, అడవుల సంరక్షణ అందరి బాధ్యత:ఎఫ్ఆర్ఓ

పల్లె వాణి బయ్యారం : వన్య ప్రాణులు అడవుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని బయ్యారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సువచ్చాల రెడ్డి అన్నారు.ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా బయ్యారం మండల కేంద్రంలో ఫారెస్ట్ అధికారి కార్యాలయం నుండి బస్ స్టాండ్ సెంటర్ వరకు అటవీ అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.వన్యప్రాణుల మనుగడపై మండల ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా ఎఫ్ఆర్ఓ సువచ్చాల మాట్లాడుతూ అడవుల్లో చాలా రకాల జీవజాతులు నివసిస్తున్నాయని,జీవ వైవిధ్యంతో మానవ మనుగడ అడవులతో ముడిపడి ఉందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓలు రమేష్, రవి, ఎఫ్ఎస్ఓ సాంబశివరావు, రేంజ్ బిట్ అధికారులు,బేస్ క్యాంప్ సిబ్బంది,డిఈఓ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button