Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra Pradesh

సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది, అల్లర్లు చేస్తే చర్యలు తప్పవు…. జిల్లా ఏస్పీ

తిరుపతి జిల్లా: తిరుపతి పోలీస్ ప్రధాన కార్యాలయం లో నేడు గురువారం జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్. పత్రిక ప్రకటన లో మాట్లాడుతు….. సోషల్ మీడియా మరియు ఇతర మార్గాల ద్వారా రాబడుతున్న సమాచారాన్ని బట్టి, శుక్రవారం 04-04-2026 వ తేది న ఉదయం 9 గంటలకు తిరుపతి పట్టణం లోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం వద్ద టీటీడీ చైర్మన్ బి. ఆర్. నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు మరియు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారని మాకు తెలియవచ్చింది. అదేవిధంగా, ఈ కార్యక్రమానికి ప్రతిగా తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని ప్రత్యేక పూజలను నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నారని పోలీసు వారికి విశ్వసనీయంగా తెలియవచ్చింది. దీనివల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది కనుక శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా శాంతికి భంగం వాటిల్లకుండా తిరుపతి జిల్లాలోని అన్ని పోలీసు సబ్-డివిజన్ల మరియు మండల పరిధిలో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ (సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ) ఇప్పటికే అమలులో ఉన్న సందర్బంగా పై కార్యక్రమాలను ముందస్తు పోలీసు అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు, సమావేశాలు, నిర్వహించడం మరియు నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది (4 ఆర్ మోర్ ) గుంపులుగా గుమికూడడం పూర్తిగా నిషేధించబడినది. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమించినట్లైతే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడుతయాన్నారు. ప్రజా శాంతిభద్రతల దృష్ట్యా, అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు మరియు ఇతర సంఘాల వారు పోలీసు వారికి సహకరించలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button