
కూకట్పల్లి, ఫిబ్రవరి 19:
కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలోని పద్మావతి ప్లాజాలో మహారాష్ట్ర వీరపుత్రుడు, హిందూ సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కళ్యాణి శివ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.ముందుగా శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దేశభక్తి నినాదాలతో కార్యక్రమ ప్రాంగణం మారుమోగింది. శివాజీ మహారాజ్ చూపిన ధైర్యసాహసాలు, పరిపాలనా నైపుణ్యం, స్వాభిమాన భావం గురించి పలువురు ప్రసంగించారు.యువతలో దేశభక్తి, స్వాభిమాన స్పూర్తిని నూరిపోసే మహనీయుడిగా శివాజీ మహారాజ్ నిలిచారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆయన జీవితం ప్రతి భారతీయుడికి ఆదర్శమని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాఘవ, భాస్కర్ తొట, శ్రీపతి, రాజేష్, హర్ష శ్రీ, సచిన్, వెంకట్, శివ బాబు, రాజా కుమార్, భారత, రమేష్ తదితరులు పాల్గొన్నారు.


