Andhra PradeshKadapa
సాయినాధునికి ప్రత్యేక పూజలు

పులివెందుల అర్బన్, ఫిబ్రవరి 19:
పులివెందుల పట్టణంలోని పార్నపల్లి రోడ్డు సమీపంలో మొట్టమొదటిగా కొలువైన శ్రీ శిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం షిరిడి సాయిబాబా కు విశేష పూజలు నిర్వహించారు. ఉదయాస్తమాన స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు మురళి స్వామి ఆధ్వర్యంలో సాయినాధునికి ఉదయం కాగడ హారతి, పంచామృతాభిషేకం, సహస్రనామార్చన,అష్టోత్తర శతనామావళి,తదితర పూజా కార్యక్రమాల అనంతరం స్వామి వారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్నం హారతి సాయంకాలం 6 గంటలకు సంధ్య హారతి రాత్రి 9 గంటలకు శేజ హారతులు స్వామివారికి అర్పించారు. అనంతరంస్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు.


