Andhra PradeshKadapaPolitical

ఎర్రగుడిపాలెం ఘనంగా ఛత్రపతి శివాజీ 396వ జయంతి వేడుకలు

శివాజీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

శివాజీ స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

కడప పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అక్కులుగారి విజయ్ కుమార్ రెడ్డి

పులివెందుల అర్బన్, ఫిబ్రవరి 19:

మరాఠా వీరుడు,హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ 556వ జయంతి వేడుకలు గురువారం పులివెందుల మండలంలోని ఎర్రగుడిపాలేం లో అత్యంత వైభవంగా నిర్వహించారు. కడప పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అక్కులుగారి విజయ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విజయ్ కుమార్ రెడ్డి యూత్ సేన సభ్యులతో కలిసి వేడుకలను ఘనంగా జరిపారు.
​శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని విజయ్ కుమార్ రెడ్డి కేక్ కట్ చేసి అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు.
​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ కేవలం ఒక రాజు మాత్రమే కాదని, ధైర్యసాహసాలకు,పరిపాలనా దక్షతకు నిదర్శనమని కొనియాడారు.శివాజీ చూపిన పోరాట పటిమను,క్రమశిక్షణను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
​విజయ్ కుమార్ రెడ్డి యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొని శివాజీ మహరాజ్ నామస్మరణతో సందడి చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button