Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra Pradesh

ఈనెల 30వ తేదీన 1160 ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు

ఏలూరు : ఏలూరు జిల్లాలో పిఎంఏవై, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పధకం కింద ఈనెల 30వ తేదీన 1160 ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. ఏలూరు జిల్లాలో పిఎంఏవై, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పధకం కింద 82 వేల 443 మంది పేదలకు ఇళ్ళు మంజూరు చేయడం జరిగిందని, వాటిలో ఇప్పటివరకు 45 వేల 089 ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయి లబ్దిదారులకు అందించడం జరిగిందన్నారు. మరో 1160 ఇళ్ల నిర్మాణాలు పూర్తికావడంతో ఈనెల 30వ తేదీన లబ్దిదారులకు అందించడం జరుగుతుందన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో 123 ఇళ్ళు , దెందులూరులో నియోజకవర్గంలో 89, ఏలూరు లో 502, గోపాలపురంలో 12, కైకలూరులో 172, నూజివీడులో 119, పోలవరంలో 91, ఉంగుటూరు నియోజకవర్గంలో 52 ఇళ్ల నిర్మాణాలు పూర్తిఅయ్యాయయని, వాటిని జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో సోమవారం పండుగ వాతావరణంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లబ్దిదారులకు అందించడం జరుగుతుందని కలెక్టర్ వెట్రిసెల్వి తెలియజేసారు.
—————————————————–
(జిల్లా సమాచార శాఖ, ఏలూరు జిల్లా, ఏలూరు వారిచే జారీ చేయబడినది)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button