Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra Pradesh

గిరిజన బాల, బాలికకు భరోషా కల్పించిన…. జిల్లా కలెక్టర్, జిల్లా ఏస్పీ

తిరుపతి : తిరుపతి జిల్లా, రైల్వె కోడూరు నియోజకవర్గం, ఓబులవారి పల్లి మండలం లోనీ పెద్ద ఊరంపాడు గ్రామంలో ఈ నెల 3 వ తేదీన పూజ అనే 10 సంవత్సరాల గిరిజన బాలిక కనబడకుండా పోయిన సంఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న తిరుపతి జిల్లా, ఏస్పీ యల్. సుబ్బరాయుడు ఐపీస్ మరియు అడిషనల్ యస్పీ రవి మనోహర చారి మరియు రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాలు మేరకు రైల్వే కోడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాసులు మరియు ఓబుళవారిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ మహేష్ నాయుడు, ప్రత్యేక బృందాలు గాలించగా గంటల వ్యవధి లో తప్పిపోయిన బాలిక ఆచూకీ కనుగొని వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు.
వారి కుటుంబ పరిస్థితి నీ తెలుసుకున్న జిల్లా యంత్రాంగం, నేడు మంగళవారం బాలిక పూజ మరియు ఆమె సోదరుడు వెంకటేసులు మరియు వారి కుటుంబ సభ్యులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, ఐఏఎస్., మరియు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్. తిరుపతి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.వారి పరిస్థితులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
బాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని , జిల్లా కలెక్టర్ ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి రు.50,000 చొప్పున రు.1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ అందజేయనున్నట్లు ప్రకటించారు. అలాగే, గురుకుల పాఠశాలలో ఉచిత విద్య మరియు వసతి అందించేందుకు ట్రైబల్ వెల్ఫేర్ పీడీ రాజా సోము మరియు బీసీ వెల్ఫేర్ పీడీ యం. భరత్ కుమార్ రెడ్డికి తగిన ఆదేశాలు జారీ చేశారు.
పోలీసు శాఖ తరఫున, జిల్లా ఏ స్పీ యల్. సుబ్బరాయుడు ఐపిఎస్. పిల్లలకు రు.10,000 నగదు సహాయం మరియు నూతన వస్త్రాలను అందజేశారు. పిల్లల భవిష్యత్తు కోసం అవసరమైన ఏదైనా సహాయం కొరకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారి నానమ్మ, పొల్లమ్మ, తాతయ్య పోలయ్యకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, కోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు, ఓబులువారిపల్లి ఎస్ఐ మహేశ్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button