పాఠశాలల ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్.

పల్లె వాణి బయ్యారం,మార్చి5.బయ్యారం మండలంలోని ఇర్సులాపురంలోని ఆశ్రమ పాఠశాల, అంగన్వాడి కేంద్రం,ప్రాథమిక పాఠశాలలను గురువారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాల,అంగన్వాడి కేంద్రంలలో స్టాక్, రిజిస్టర్,పిల్లలు,ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్,స్టోర్ గది,డైనింగ్ హాల్, కిచెన్ షెడ్,స్టడీ రూమ్,పరిసరాలను పరిశీలించారు.పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
జిల్లాలో పదవ తరగతి విద్యార్థులు, మొత్తం 7044 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉండగా,ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా,మానసికంగా దృఢంగా ఉండే విధంగా తరగతులు నిర్వహిస్తూ నిత్యం గమనించడం జరుగుతుందన్నారు.ప్రత్యేక అధికారులను నియమించి 100 శాతం ఫలితాలు వచ్చే విధంగా ప్రత్యేక తరగతులు,ఉదయం,సాయంత్రం ఏర్పాటు చేస్తూ పిల్లలకు ఎలాంటి మానసిక ఒత్తిడి లు లేకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించాలన్నారు.
ప్రతి రోజు అధికారుల పరిశీలన ద్వారా అత్యుత్తమ ఫలితాలను సాధించడం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు.
రానున్న పరీక్షల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులకు ఏలాంటి మానసిక ఒత్తిడి లేకుండా వారికి అర్థమయ్యే విధంగా నూతన డిజిటల్ తరగతులు ప్రాక్టికల్స్ ద్వారా విద్యను అందించాలని,పక్కాగా డైట్ మెనూ పాటించాలన్నారు.తద్వారా పిల్లలు మంచి వాతావరణంలో విద్యను కొనసాగించి ఉత్తమ ఫలితాలు సాధించుటకు ఉపయోగపడతాయన్నారు.
ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు కచ్చితంగా సమయపాలన పాటించి సిలబస్ పూర్తి చేయాలన్నారు.ప్రతి విద్యార్థిని,గమనిస్తూ ఉండాలని, విద్యలో వెనుకబడిన పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తూ వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలను బోధించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ అధికారి దేశీరాం నాయక్, స్థానిక తహసిల్దార్ నాగరాజు,ఎంపీడీవో దీపిక ఉపాద్యాయులు,తదితరులు పాల్గొన్నారు.



