6.5 కిలోల గంజాయి స్వాధీనం – ముగ్గురు అరెస్ట్….. రూరల్ సీఐ.

తిరుపతి జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గం మరియు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాసులు ప్రేష్మిట్ లో మాట్లాడుతు…. తిరుపతి జిల్లా ఏ స్పీ, యల్. సుబ్బారాయుడు ఐపీస్, ఆదేశాలు మేరకు మరియు
అదనపు ఎస్పీ, ఆర్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో మరియు రేణిగుంట డీఎస్పీ వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో రేణిగుంట సబ్-డివిజన్ వ్యాప్తంగా గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వలు మరియు విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందన్నారు.
ఈ క్రమంలో నేడు సోమవారం పెనగలూరు మండల పరిధిలోని బెస్తపల్లి గ్రామ సమీపంలో విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో గంజాయి అక్రమ రవాణా మరియు విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను, పెనగలూరు ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి మరియు పోలీసు సిబ్బంది అరెస్ట్ చేశమన్నారు.
ఈ ఆపరేషన్లో నిందితుల వద్ద నుండి 6.5 కిలోల గంజాయి, ఒక టాటా సుమో వాహనం మరియు మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నమన్నారు.
అరెస్ట్ చేయబడిన నిందితులు1)కంచర్ల సుబ్బారెడ్డి (71), చక్రంపేట గ్రామం, పెనగలూరు మండలం. 2 )తోడేటి శేఖర్ అలియాస్ బుజ్జి (50), బోయినపల్లి గ్రామం, రాజంపేట మండలం. 3) వడివేలు శీలంబర్సన్ అలియాస్ అజయ్ (37), సెనగతకులం, వడమధురై పోస్ట్, తిరువళ్లూరు జిల్లా, తమిళనాడు.
పరారీలో ఉన్న నిందితుడు- సుబ్బారాయుడు, నల్లతిమ్మయ్యగారిపల్లి, నందలూరు మండలం.
ప్రాథమిక విచారణలో నిందితులు గంజాయిని సేకరించి పరిసర గ్రామాలు మరియు ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. విచారణలో భాగంగా గంజాయి సరఫరా వ్యవస్థకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయని,ఈ అక్రమ వ్యాపారం వెనుక ఉన్న వ్యక్తులు, సరఫరా మార్గాలు మరియు సంబంధిత నెట్వర్క్ను పూర్తిగా వెలికితీసేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నమన్నారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు చర్యలు తీసుకుంటున్న మన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీసులు మాట్లాడుతూ, మాదకద్రవ్యాలు వ్యక్తుల ఆరోగ్యాన్నే కాకుండా కుటుంబాల ప్రశాంతతను, యువత భవిష్యత్తును మరియు సమాజ భద్రతను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వ్యసనం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థిక, సామాజిక మరియు మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ సమస్యను అరికట్టడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లల స్నేహితులు, అలవాట్లు మరియు రోజువారీ కార్యకలాపాలపై శ్రద్ధ వహించాలని, ఉపాధ్యాయులు మరియు సమాజ పెద్దలు యువతలో అవగాహన కల్పించాలని సూచించారు. యువత తమ లక్ష్యాలు, విద్య, ఉపాధి మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారించి మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని కోరారు.
మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
“మాదకద్రవ్యాలకు ‘నో’ చెప్పండి – ఆరోగ్యకరమైన కుటుంబాన్ని, సురక్షితమైన సమాజాన్ని నిర్మిద్దాం. యువతను కాపాడటం అంటే భవిష్యత్తును కాపాడటమే.” మన లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో…. పోలీస్ అధికారులు పాల్గొన్నారు.



