సమ్మెతో నిలిచిపోనున్న ఆస్తుల రిజిస్ట్రేషన్లు

కళ్యాణదుర్గం: రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రైవేటు
వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కళ్యాణదుర్గం దస్తావేజు లేఖర్ల సంఘం సోమవారం తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. వారు మాట్లాడుతూ ప్రజల ఆస్తుల వ్యవస్థను ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తే వాటికి భద్రత ఎక్కడ ఉంటుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం చేశారు. ఇకపై ఆస్తుల క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు వంటి వాటికి దస్తావేజులు (డాక్యుమెంట్లు) తయారు చేయడాన్ని నిలిపివేయనున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 234 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో లక్ష మందికి పైగా దస్తావేజు లేఖరులు ఉన్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొత్తం వారి ద్వారానే జరు గుతుండటంతో సమ్మె నేపథ్యంలో అస్తుల క్రయ విక్రయాలు, ఇతర డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. అల్లూరి సీతారామరాజు, పోలవరం మినహా మిగిలిన 26 జిల్లా కేంద్రాల్లో పీపీపీ విధానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే)ఆర్ఎస్కేల ఆలోచన విరమించు కోవాలన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఆలోచనను తక్షణం విరమించుకోవాలి. వీటివల్ల లక్ష మంది డాక్యుమెంట్ రైటర్ల కుటుంబాలు రోడ్డున పడతారన్నారు. మా కడుపులు కొట్టి ప్రైవేటు కంపెనీల జేబులు నింపాలను కోవడం సరికాదన్నారు.



