Uncategorized

“మర్డర్ ఫర్ గెయిన్” కేసును అత్యంత వేగంగా ఛేదించిన…. పోలీస్ అధికారులు

తిరుపతి జిల్లా: తిరుపతి సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం లో నేడు ఆదివారం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్, మాట్లాడుతు….. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన “మర్డర్ ఫర్ గెయిన్” కేసు ఛేదనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. 14-07-2026న తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినగర్ పంచాయతీ, విజయనగర్ ప్రాంతంలో ఒంటరిగా నివసిస్తున్న ఎం. జ్యోతి (69)పై నిందితుడు అత్యంత దారుణంగా దాడి చేసి హత్య చేశారన్నారు.అనంతరం ఆమె ధరించిన బంగారు ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న సుమారు 90 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రు.47,000 నగదు అపహరించి పరారయడని,
అనంతరం దర్యాప్తులో పాత పరిచయాన్నే అవకాశంగా మార్చుకున్న నిందితుడు పాశం రూపేష్ కుమార్, వయసు 36 సంవత్సరములు, గుడిపల్లిపాడు గ్రామము, నెల్లూరు రూరల్ మండలము, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా రైల్వే శాఖలో లోకో పైలట్‌గా కృష్ణపట్నం రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించమన్నారు.
బాధిత కుటుంబంతో గత కొన్నేళ్లుగా ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకుని, కుటుంబ పరిస్థితులపై ఉన్న అవగాహనతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ నేరానికి పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని,
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా బంగారు ఆభరణాలను అపహరించి విక్రయించడం ద్వారా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకుని ఈ నేరాన్ని అమలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
తన గుర్తింపును దాచిపెట్టేందుకు నిందితుడు ముందుగానే నేరానికి పకడ్బందీ ప్రణాళిక చేసుకొని, తనతో పాటు పని చేస్తున్న లోకో పైలెట్ కి చెందిన స్కూటీనీ దొంగతనము చేసి, ఫేక్ నంబర్ ప్లేట్ ను అమర్చాడని,మహిళలు ధరించే నల్లని బురఖాని ముఖానికి స్కార్ఫ్, హెల్మెట్ ధరించి తిరుపతికి చేరుకున్నాడన్నారు.
ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి జిల్లా పోలీసులు శాస్త్రీయ–సాంకేతిక డిజిటల్ ఆధారాలు, ఇతర శాస్త్రీయ సాక్ష్యాలను సమగ్రంగా విశ్లేషించారని,నిందితుడి యొక్క ప్రతి కదలికను అనుసంధానం చేస్తూ ప్రత్యేక బృందాలు నిరంతరంగా దర్యాప్తు కొనసాగించి, చివరకు కృష్ణపట్నం రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని అరెస్టు చేశారన్నారు.
అలాగే నిందితుడి వద్ద నుంచి దర్యాప్తులో భాగంగా సుమారు 12 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు,నేరానికి ఉపయోగించిన కత్తి తో పాటు నేరానికి వాడిన స్కూటీని స్వాధీనం చేసుకోవడమైనదన్నారు.
“ప్రత్యేక బృందాల కృషి”
ఈ కేసు దర్యాప్తును అడిషనల్ ఎస్పీలు ఆర్ల శ్రీనివాసులు, కె. రవి మనోహరాచారి వారి ఆధ్వర్యంలో, చంద్రగిరి ఎస్‌డీపీఓ.బేతపూడి ప్రసాద్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు నిర్వహించాయన్నారు.
తిరుపతి రూరల్ ఇన్‌స్పెక్టర్ కె. మద్దయ్య చారి, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు శివకుమార్ రెడ్డి, టి. అబ్బన్న, ఎస్‌ఐలు పి. శ్రీరాములు, జ్యోతి, నాగార్జున రెడ్డి,చిరంజీవి, ఐడీ పార్టీ సిబ్బంది లక్ష్మీ ప్రసాద్, గౌస్ అరీఫ్, సూర్య ప్రసాద్, ప్రభాకర్, ప్రసాద్, శ్రీనివాసులు, రమేష్, నాగరాజు శెట్టి, మురళి లతో సమన్వయంతో పనిచేసి కేసును విజయవంతంగా ఛేదించరన్నారు.
“జిల్లా ఏ స్పీ ప్రజలకు హెచ్చరిక…. “నేరం చేసి తప్పించుకోవచ్చని ఎవరూ భావించవద్దు. నేరస్థుడు ఎంత పకడ్బందీగా ప్రణాళిక రచించినా, ఎంత మారువేషం ధరించినా, ఎన్ని ఆధారాలు చెరిపివేయాలని ప్రయత్నించినా శాస్త్రీయ–సాంకేతిక దర్యాప్తు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మరియు పోలీసుల నిరంతర నిఘా ముందు తప్పించుకోవడం అసాధ్యం. ప్రతి నేరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రతి ఆధారాన్ని సూక్ష్మంగా విశ్లేషించి నేరస్థులను చట్టం ముందు నిలబెట్టడం తిరుపతి జిల్లా పోలీసుల బాధ్యత. ప్రజల భద్రతకు భంగం కలిగించే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదు. నేరస్థుడు ఎంత దూరం పారిపోయినా, చట్టం ధృష్టి నుండి తప్పించుకోలేడు.” అని అన్నారు.
ఈ కేసును అత్యంత వేగంగా ఛేదించి నిందితుడిని అరెస్టు చేసిన అధికారులను, ప్రత్యేక దర్యాప్తు బృందాలను మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు., ఐపీఎస్. అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button