మాజీ మంత్రి ఆర్ కె. రోజ, 30 వ తేది విచారణ కు రావలన్న…. పోలీస్ అధికారులు.

తిరుపతి జిల్లా: నగరి నియోజకవర్గం లో సినినటి మరియు వైస్సార్ కాంగ్రెష్ పార్టీ మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ…..నేడు “యన్ డి ఏ” కూటమి పార్టీ అధిష్టానం నాయకులు రాజకీయ కక్షసాధింపుతోనే నాపై అక్రమ కేసులు, కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనపై అక్రమ కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేసిందని, వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్‌రెడ్డితో పాటు పార్టీ నాయకుల కుటుంబాల్లోని మహిళలపై ఆంధ్రజ్యోతి దినపత్రిక అవాస్తవ కథనాలు ప్రచురించిందని,
దీనికి నిరసనగా ఆ పత్రిక ప్రతులను దహనం చేస్తే తనపై కేసు నమోదు చేయడం దారుణమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కు ప్రతి పౌరుడికీ ఉందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకే కూటమి ప్రభుత్వం ఇటువంటి వేధింపులకు పాల్పడుతోందని,బెదిరింపులకు, అక్రమ కేసులకు వైయస్ఆర్ సీపీ భయపడదని, ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.



