వేంపల్లి, చక్రాయపేట పోలీస్ స్టేషన్ల ను ఆకస్మిక తనిఖీ….. జిల్లా ఎస్పి

కడప జిల్లా: పులివెందుల పోలీస్ సబ్ డివిజన్ లోని వేంపల్లి, చక్రాయపేట పోలీస్ స్టేషన్ల ను నేడు గురువారం జిల్లా ఎస్పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్, ఆకస్మిక తనిఖీ చేశారు.
అనంతరం పోలీస్ స్టేషన్ లో రికార్డులు పరిశీలించి మరియు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు.
పాత నేరస్థులు, సస్పెక్ట్ ల కార్యకలాపాలపై నిఘా ఉంచాలని సంబంధిత స్టేషన్ అధికారులకు సూచించారు.
ఆలాగే పోలీస్ స్టేషన్ లలోని సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధుల గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మరింత సమర్ధవంతంగా విధులు నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు. వృత్తిపరమైన సమస్యలేమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే విలేజ్ పోలీస్ ఆఫీసర్ల (వీపీవో ) ల విధుల గురించి ఆరాతీసి వారికి పలు సూచనలు చేశారు.
యన్ హెచ్ 440 జాతీయ రహదారి నిర్మాణంలో ఉన్నందున వాహనదారులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వేంపల్లి సి.ఐ నరసింహులును ఆదేశించారు.
అలాగే విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా గ్రామాలకు వెళ్లి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించాలని ఆదేశించారు.
గ్రామాల్లో నైట్ హాల్ట్ చేయాలని ఆదేశించారు.
అనంతరం అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తదితర నేరాలు జరగకుండా గట్టిగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే పెండింగ్ కేసులు త్వరితగతిన విచారించి పరిష్కరించాలని ఆదేశించారు.
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా డే బీట్ లు, నైట్ బీట్ లు పెంచాలని ఆదేశించారు. అనంతరం అనుమానాస్పదంగా తిరిగే వారిని విచారించాలన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
అలాగే స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదు దారుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో…. స్పెషల్ బ్రాంచ్ డి ఏస్పీ ఎన్.సుధాకర్, పులివెందుల డి ఏస్పీ బి.మురళి, వేంపల్లి సి.ఐ నరసింహులు, ఆర్కే వ్యాలీ సి.ఐ శంకర్ రెడ్డి, చక్రాయపేట ఎస్.ఐ చంద్రశేఖర్ ఉన్నారు.



