Uncategorized

శ్రీ ఎల్లమ్మ తల్లి జాతర కు భద్రత ఏర్పాట్లు…. జిల్లా ఏస్పీ

మదనపల్లి జిల్లా : కలికిరిలో జరగనున్న శ్రీ ఎల్లమ్మ తల్లి జాతరకు ముందస్తు భద్రతా ఏర్పాట్లను నేడు గురువారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
అనంతరం భక్తులకు, ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు మరియు వృద్ధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పక్కాగా క్యూలైన్ల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు.
ఆలాగే రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపులు, స్పష్టమైన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అనంతరం అసాంఘిక శక్తులపై డేగకన్ను వేసి, పండుగ వాతావరణంలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో…. రాయచోటి డీఎస్పీ ఎం ఆర్. కృష్ణమోహన్, కలికిరి సీఐ అనిల్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ సదాశివయ్య పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button