డ్రగ్స్ పై పోలీసులకు సమాచారం అందించండి:డి.ఎస్.పి.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా జూన్ 26: ప్రజల కు డ్రగ్స్ పై సమాచారం ఉంటే పోలీసులకు వెంటనే అందించాలని డిఎస్పీ తిరుపతిరావు అన్నారు.సమాచారం ఇచ్చినవారికి ఐదువేల రూపాయల నజరానా ఉంటుందని సూచించారు. శుక్రవారం మహబూబాబాద్ సబ్ జైల్లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. జైలర్ మల్లెల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ డిఎస్పీ నంబూరు తిరుపతి రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జైల్లోని ఖైదీలచే డ్రగ్స్ వ్యతిరేక ప్రతిజ్ఞను చేయించారు. డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసై వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని డిఎస్పి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సిటిజన్ ఫోరం సభ్యులు శంతన్ రామరాజు, జైలు సిబ్బంది మహ్మద్ ఖళీళ్, ఎమ్మెనో లక్ష్మన్, మోటపోతుల వీరన్న, పోషిని జనార్దన్, రామాంజనేయులు, నర్సింహారావు తో పాటు ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.



