పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్: సి ఐ.

పల్లె వాణి మహబూబాబాద్ మార్చి 24:మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి లోబరుచుకుని, గర్భవతిని చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం మేరకు… నిందితుడు ఎండి మౌలానా 20 సం,,లు, R/o కంకరబోర్డు, మహబూబాబాద్ అనే అతను స్థానిక ఫోటో స్టూడియోలో పనిచేస్తున్నాడు. ఫోటో కోసం వచ్చిన బాలికకు మాయ మాటలు చెప్పి లోబరుచుకొని, సంవత్సర కాలంగా రిలేషన్షిప్ కొనసాగిస్తున్నాడు. బాలిక తీరుపై మార్పును గమనించిన తల్లిదండ్రులు కూతురిని నిలదీయడంతో అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించాగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి, మంగళవారం నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినామని టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు.



