Kadapa

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసిన…జిల్లా కలెక్టర్

తిరుపతిజిల్లా : తిరుపతి పట్టణంలో నేడు సోమవారం స్థానిక సరోజినీదేవి లే అవుట్ నందు గల పండిట్ జవహర్ లాల్ నెహ్రు పురపాలకొన్నత పాఠశాల, వరదరాజ నగర్ నందు శశి ఇంగ్లీష్ మీడియం స్కూల్, నందు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల నిర్వహణ సరళిని, పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్. జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం, త్రాగునీరు, మౌలిక సదుపాయాలు ఏర్పాట్లను పరిశీలించారు. వేసవి ఎండల దృష్ట్యా పరీక్షలు రాసే విద్యార్థులు అస్వస్థకు గురికాకుండా తక్షణం వైద్య సేవలు అందించేందుకు ఓఆర్ఎస్, అత్యవసర మందులు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు తావులేకుండా పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని పరీక్షల నిర్వహణ సిబ్బందికి కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి కె వి యన్, కుమార్ పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button