Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Telangana

11న మహబూబాబాద్ లో జాబ్ మేళా:టి.రజిత.

ఇన్స్ కార్డ్ ప్రైవేట్ లిమిటెడ్(ఫ్లిప్ కార్ట్) సంస్థ లో మహబూబాబాద్ జిల్లా పరిధిలో డెలివరీ ఎగ్జిక్యూటివ్/ విష్ మాస్టర్ గా పనిచేయుటకు 10 వ తరగతి ఆ పైన చదివి 18 -35 వయసు గల అర్హత కలిగిన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు,11జిల్లా ఎంప్లాయ్‌మెంట్ కార్యాలయం, మహబూబాబాద్ నందు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి.రజిత నేడు ఒక ప్రకటనలో తెలిపారు.పండుగ సీజన్లు రానున్న సందర్భంగా ఆన్‌లైన్ షాపింగ్‌కు భారీగా డిమాండ్ పెరగడం, ప్రజలు ఎక్కువగా ఆఫర్లు వినియోగించుకోవడం వలన డెలివరీ సేవలకు అత్యధిక అవసరం ఏర్పడినందున, ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అభ్యర్దులు డ్రైవింగ్ లైసెన్స్ , బైక్ , స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. అర్హత ఆసక్తి కల్గిన అభ్యర్దులు తేది: 11.03.2026 న మహబూబాబాద్ లో జిల్లా ఎంప్లాయ్ మెంట్ కార్యాలయం, రూమ్ నెం. 25 , రెండవ అంతస్తు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, కురవి రోడ్, మహబూబాబాద్ జరుగు జాబ్ మేళా కు విద్యార్హత సర్టిఫికేట్లతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో హాజరై ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా ఉపాధి అధికారి గారు కోరారు.మరిన్ని వివరాలకు టీం లీడర్స్ రాజు 9121268407,సురేష్ 9908073593 ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చునని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button