Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra Pradesh

అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాలకు చేయూత….. జిల్లా ఎస్పీ

తిరుపతి : తిరుపతి జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం లో నేడు బుధవారం జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్, మాట్లాడుతు…. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ అకాల మరణం చెందిన హోంగార్డుల కుటుంబాలకు అండగా నిలిచమన్నారు.
తిరుపతి జిల్లా లో విధులు నిర్వహిస్తూ అకాల మరణం పొందిన హోంగార్డు టి. రమేష్ బాబు సతీమణి యం. వసంతమ్మ కి “కంపస్సిఒనాటే అప్పోయింట్మెంట్” ద్వారా ఉద్యోగ అవకాశం కల్పిస్తూ అపాయింట్మెంట్ లెటర్ను అందజేశమన్నారు. అదేవిధంగా, ఎన్. రమణారెడ్డి (హెచ్ జి.1478) కుటుంబ సభ్యులకు రూ.5,00,000/- మరియు టి. సునీల్ కుమార్ (హెచ్డీ 116) కుటుంబ సభ్యులకు రూ.5,00,000/- మరియు జి. భాస్కర్ (హెచ్ జి.1460) కుటుంబ సభ్యులకు రూ.5,00,000/- మొత్తం రూ.15,00,000/- ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశమన్నారు.
“పోలీస్ శాఖకు అనుబంధంగా పని చేస్తూ సమాజానికి సేవలందిస్తున్న హోంగార్డు విభాగం మా కుటుంబ సభ్యులతో సమానమని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోంగార్డుల కుటుంబాలకు అండగా నిలవడం మా బాధ్యతని, వారి కుటుంబాలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో హోంగార్డ్ డీఎస్పీ కె.జే.యం. చిరంజీవి, ఏవో కె. సురేష్ బాబు, ఆర్ఐ వి.ఎస్. రమణ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button