Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra Pradesh

14 సంవత్సరాల నిండిన బాలికలకు హెచ్ పి వి వాక్సినేషన్ తప్పనిసరిగా వేయించాలి… ఎమ్మెల్యే చిర్రి బాలరాజు

జీలుగుమిల్లి : స్త్రీలలో వచ్చే గర్భాశయ క్యాన్సర్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హెచ్.పి.వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.*ప్రారంభించారు., సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం, సంక్షేమం కూటమి ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పేర్కొన్నారు. మహిళల్లో పెరుగుతున్న గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతూ హెచ్.పి.వి (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా యువతులు మరియు మహిళలను ముందస్తుగా ఈ ప్రమాదకర వ్యాధి నుండి రక్షించవచ్చని ఆయన తెలిపారు.
బుధవారం జీలుగుమిల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన హెచ్.పి.వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన మహిళలు మరియు విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బంది మొదటి విడతలో నిర్దేశించిన పలువురు మహిళలు మరియు విద్యార్థినులకు హెచ్.పి.వి టీకాలను అందజేశారు. టీకా తీసుకున్న తర్వాత మహిళలు ఆరోగ్యంగా ఉండేలా వైద్యులు అవసరమైన సూచనలు కూడా ఇచ్చారు.
అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ ప్రస్తుతం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ప్రమాదకర వ్యాధులలో ఒకటని తెలిపారు. అయితే సరైన అవగాహన, ముందస్తు పరీక్షలు మరియు హెచ్.పి.వి వ్యాక్సిన్ ద్వారా ఈ వ్యాధిని చాలా వరకు నివారించవచ్చని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా మహిళలు తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వం అందిస్తున్న ఈ టీకా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మహిళల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగంలో అనేక వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ప్రజలు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవాలని, ముఖ్యంగా యువతులు ఈ హెచ్.పి.వి టీకాను తప్పనిసరిగా తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వైద్య సిబ్బంది గ్రామాలలోకి వెళ్లి మహిళలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఎక్కువ మందికి ఈ టీకా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ సురేష్, ఎమ్మార్వో వెంకటేశ్వరరావు, ఎంపీడీవో వెంకటలక్ష్మి, జనసేన మండల అధ్యక్షుడు పసుపులేటి రాము,కూటమి నాయకులు కోల మధు, చిర్రి శ్రీనివాస్, తమ్మన సాంబశివరావు, నాలి శ్రీనివాస్, గూడెల్లి లక్ష్మీనారాయణ, బండారు అనిల్, కక్కిరాల మురళి, వైద్య అధికారులు, వైద్య సిబ్బంది మరియు ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button