Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Telangana

గ్యాస్ సరఫరా పై అసత్య ప్రచారాలను నమ్మవద్దు: ఎస్పీ, కలెక్టర్.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా మార్చి 13: గ్యాస్ సరఫరా పై అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరిష్, కలెక్టర్ స్నేహ శబరిష్ ప్రజలకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్, అదనపు కలెక్టర్ రెవెన్యూ అనిల్ కుమార్, సివిల్ సప్లై, గ్యాస్ డీలర్స్, విద్యాశాఖ, హాస్పటల్ సంబంధిత అధికారులతో కలిసి గ్యాస్ సరఫరా పై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం (11) ఏజెన్సీల పరిధిలో 2,12131 గ్యాస్ కనెక్షన్లు కలవని, గతవారం రోజుల నుండి పైన తెలిపిన 11 గ్యాస్ ఏజెన్సీల ద్వారా 13985 సిలిండర్ల వినియోగదారులకు
పంపిణీ చేయడం జరిగిందని, డిమాండ్ కు అనుగుణంగా సంబంధిత ఏజెన్సీల వద్ద వినియోగదారులకు సరిపడా గ్యాస్ సిలిండర్లు నిల్వలో సిద్ధంగా ఉన్నాయన్నారు, అనవసరంగా ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, డిమాండ్ కనుగుణంగా గ్యాస్ లభ్యత ఉందని, తెలిపారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. సివిల్ సప్లై విజిలెన్స్ కమిటీ సభ్యులు నిత్యం గ్యాస్ డీలర్ల వద్ద ఉన్న స్టాకును గమనిస్తూ ఉండాలని వినియోగదారులతో పాటు ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు గ్యాస్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. హోటళ్ళు, రెస్టారెంట్లలో కమర్షియల్ సిలిండర్ మాత్రమే ఉపయోగించాలని, డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్యాస్ డెలివరీ చేసే సమయంలో డెలివరీ బాయ్ కి ఓటీపీ చెప్పి సహకరించాలని, వారి విధులకు ఎవరైనా ఆటంకము కలిగించినట్లయితే, అలాంటి వినియోగదరులపైన కూడా చట్టపరముగా చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఎల్పీజీ వినియోగదారులు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేసుకోవాలని, గ్యాస్ ఏజెన్సీల వద్ద, ఆన్లైన్లో కానీ గ్యాస్ కంపెనీ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ లో, గ్యాస్ సిలిండర్ పంపిణీ సమయంలో గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల వద్ద కేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు.*జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ మాట్లాడుతూ జిల్లాలో గ్యాస్ సరఫరా లో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేవని సోషల్ మీడియా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయని ఏట్టి పరిస్థితిలలో అలాంటి వార్తలను నమ్మ వద్దని తెలిపారు, ప్రభుత్వం సూచించిన ప్రకారం 25 రోజుల అనంతరం మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని, గ్యాస్ సరఫరా చేసే వాహనాలను సిబ్బందిని ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని ఎస్పీ తెలిపారు,
ఈ సమావేశంలో జిల్లా సివిల్ సప్లై అధికారి రమేష్, డి.ఎస్.పి తిరుపతిరావు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖల అధికారులు శ్రీనివాసరావు, శ్రీనివాస్, దేశీ రామ్ నాయక్, వెల్ఫేర్ అధికారిని సబిత, సంబంధిత అధికారులు, గ్యాస్ డీలర్ల సంఘం ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button