పరారిలో ఉన్న ఎర్రచందనం స్మగ్లర్ ని పట్టుకున్న పోలీసులు….. రూరల్ సీఐ

తిరుపతి జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గ, రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. శ్రీనివాసులు నేడు శనివారం పత్రిక ప్రకటన లో మాట్లాడుతు…. చిట్వేల్ సబ్ ఇన్స్పెక్టర్ యస్. వినోద్ కుమార్, 2024 నుంచి పరారీలో ఉన్న రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ కేసు నిందితుడిని, నేడు అరెస్ట్ చేసి తిరుపతి కోర్టులో హాజరుపరిచారు.
తిరుపతి జిల్లా ఎస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్, ఆదేశాలు మేరకు పెండింగ్‌లో ఉన్న నాన్-బెయిలబుల్ వారెంట్ల ( యన్ బి డబల్ యు ) అమలుపై ప్రత్యేక దృష్టి సారించినరన్నారు.
2024 సంవత్సరం నుండి కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉన్న నిందితుడిని చిట్వేల్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసి నేడు న్యాయస్థానం ముందు హాజరుపరిచరన్నారు.
అనంతరం చిట్వేల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం.35/2018, ప్రస్తుతం (ఆర్ యస్ యస్) యస్.సి . నెంబర్ .40/2023 (ఓల్డ్ యస్ .సి . నెంబర్ .85/2022) గా తిరుపతి అదనపు జిల్లా న్యాయస్థానం-కమ్-రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో విచారణలో ఉన్న కేసులో ఏ -1)కొండారెడ్డి వినోద్ కుమార్, తండ్రి చంద్ర, వయస్సు 25 సంవత్సరాలు, వెంకటేశ్వరపురం ఎస్టీ కాలనీ, రైల్వే కోడూరు మండలానికి చెందిన వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు.
అయితే, నిందితుడు 2024 సంవత్సరం నుండి కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉండటంతో, న్యాయస్థానం 07-10-2024 తేదీన అతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్ (యన్ బి డబల్ యి )జారీ చేసింది.
ఈ నేపథ్యంలో చిట్వేల్ పోలీసులు ప్రత్యేక గాలింపు చేపట్టి నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి, కోర్టు (అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు -కమ్ -స్పెషల్ కోర్ట్ ఫర్ ట్రయల్ అఫ్ కేసెస్ రెలెటింగ్ టు రెడ్ సండర్స్ సముగ్గులింగ్ , తిరుపతి ) ముందు హాజరుపరిచగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించరన్నారు.
ఈ సందర్భంగా పోలీసులు, కోర్టు వారెంట్లను అమలు చేయడంలో రాజీ ఉండదని, కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉన్న నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని తెలిపారు. అలాగే పెండింగ్‌లో ఉన్న వారెంట్ల అమలుపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని వెల్లడించారు.



