Uncategorized

భూమి విషయం లో దంపతులను మోసం చేసిన అయిదు మంది అరెస్ట్….. జిల్లా ఏ స్పీ

మదనపల్లి జిల్లా: మదనపల్లి సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం లో నేడు శనివారం జిల్లా ఏస్పీ, ధీరాజ్ కునుబిల్లి ఐపీస్, ప్రెస్మిట్ లో మాట్లాడుతు….. మదనపల్లెలో 5 కోట్ల రూపాయల విలువైన భూమిని తక్కువ ధరకు ఇస్తామని ఆశచూపి దంపతుల వద్ద 14 లక్షలు కాజేసిన ఐదుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశామన్నారు.

అనంతరం నిందితులు బాధితుల వద్ద డబ్బులు తీసుకున్న తర్వాత, తహసీల్దార్ సంతకంతో కూడిన నకిలీ (ఫోర్జరీ) పట్టాదారు పాసుపుస్తకాలను సృష్టించి ఇచ్చి ఈ మోసానికి పాల్పడ్డరన్నారు.
అలాగే మోసాన్ని గ్రహించిన బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి నేడు నిందితులను అదుపులోకి తీసుకున్నమన్నారు.
(జిల్లా ఏస్పీ ప్రజలకు తెలుపుతున్న సూచనలు)….. తక్కువ ధరకు భూములు వస్తున్నాయని ఆశపడి గుడ్డిగా నమ్మకూడదని, కొనుగోలుకు ముందు సంబంధిత రెవెన్యూ అధికారుల వద్ద రికార్డులు తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని ప్రజలకు సూచించారు.
ఈ కార్యక్రమంలో…. పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button