బెంగళూరులో గౌరవ డాక్టరేట్ అందుకున్న….. నూకల రమేష్‌బాబు

తిరుపతి జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గం, పుల్లంపేట మండలం, పుల్లంపేట గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు మరియు సామాజిక సేవకుడు నూకల రమేష్‌బాబుకు నేడు శనివారం బెంగళూరు నగరం లో ఆల్ ఇండియా బీజేపీ పార్టీ వైస్ ప్రసిడెంట్ బంజీర మరియు కార్పొరేషన్ చేర్మెన్ యస్ ఏం యు నాయక్ మరియు యూనివార్సిటీ దిన్, టి యన్. స్వామి వారి చేతుల మీదుగా, భారత్ వర్చువల్ యూనివర్సిటీ ఫర్ పీస్ ఎడ్యుకేషన్ సంస్థ హానరరీ డాక్టరేట్ ఇన్ సోషల్ సర్వీస్ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
ఆయన అందిస్తున్న విశిష్ట సామాజిక సేవ, ప్రజా జీవితంలో చేసిన కృషికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
నూకల రమేష్‌బాబు రాజకీయ ప్రస్థానం 1983లో ప్రారంభమైంది. 1983–85 మధ్య కడప జిల్లా తెలుగుదేశం పార్టీ జాయింట్ సెక్రటరీగా సేవలందించారు. అనంతరం జిల్లా అడ్హాక్ కమిటీ సభ్యుడిగా, టీడీపీ మండల అధ్యక్షుడిగా, 1987లో జిల్లా టీడీపీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1986–89 మధ్య చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు టీడీపీ పార్టీ అబ్జర్వర్‌గా వ్యవహరించారు.
అనంతరం జిల్లా హ్యాండీక్యాప్డ్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా, జిల్లా డీఆర్‌డీఏ సభ్యుడిగా, ఏపీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్‌గా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా పలు కీలక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఎదురులేని టిడిపి నాయకుగా అహర్నిశలు పార్టీ కోసం కష్టపడే నాయకుడిగా ఎంతో మంది ఎమ్మెల్యేలకు సపోర్టుగా నిలబడి వంటి చేత్తో గెలిపించిన నాయకుడిగా మన్ననలు పొందాడని కొనియాడారు.
ప్రమాదవశాత్తు శారీరక వైకల్యం ఏర్పడినప్పటికీ ప్రజాసేవలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా, పార్టీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేయడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయనకు పార్టీ అధిష్ఠానం సైతం విశేష ఆదరణ, గుర్తింపు ఇచ్చిందని పలువురు పేర్కొన్నారు.
అలాగే, పుల్లంపేటలోని ఎస్‌బీవీడీ సభ హైస్కూల్ అభివృద్ధి, పురోగతిలో నూకల రమేష్‌బాబు కీలక పాత్ర పోషించారని, ఆయన దూరదృష్టి వల్లే ఆ విద్యాసంస్థ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందిందని పలువురు విద్యావేత్తలు కొనియాడారు.
పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ, సామాజిక సేవను జీవిత ధ్యేయంగా కొనసాగిస్తున్న నూకల రమేష్‌బాబుకు గౌరవ డాక్టరేట్ లభించడం పుల్లంపేట ప్రజలకు గర్వకారణమని, ఆయన సేవలు మరింత విస్తరించాలని స్థానికులు, స్నేహితులు, అభిమానులు ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.



