ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరిస్తాం…. జిల్లా ఏస్పీ

మదనపల్లి జిల్లా: మదనపల్లె సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయంలో నేడు సోమవారం జరిగిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, మాట్లాడుతు…. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించమని,
అనంతరం మదనపల్లి జిల్లా లో నలుమూలల నుండి వచ్చిన పిర్యాదు దారులు మొత్తం నమోదైన 83 ఫిర్యాదులలో 52 భూవివాదాలు. మిగతా వాటిలో ఆర్థిక, కుటుంబ వివాదాలు చెరో 7, మోసం 6, ఇతర సమస్యలు 5, న్యూసెన్స్ 4, అలాగే ఎఫ్.ఐ.ఆర్ కు సంబంధించినవి 2 ఉన్నాయని,
భూకబ్జాలు, వడ్డీ వ్యాపారుల వేధింపులు, సైబర్ నేరాలపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించమన్నారు.
అనంతరం బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఫిర్యాదులపై విచారణ వేగంగా పూర్తిచేసి, నివేదికలను వెంటనే జిల్లా ప్రధాన కార్యాలయానికి పంపాలని ఆదేశించమన్నారు.
ఈ కార్యక్రమంలో…. పోలీసులు పాల్గొన్నారు.



