యువత జీవితాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తప్పవు….. జిల్లా ఎస్పీ

మదనపల్లె జిల్లా: గుర్రంకొండ: మదనపల్లి సూపర్ డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం లో మంగళవారం ప్రెస్మిట్ జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్, మాట్లాడుతు….
కళాశాల విద్యార్థులే లక్ష్యంగా గుర్రంకొండకు చెందిన “కలకడ ఆదిల్ ” అనే వ్యక్తి రహస్యంగా గంజాయి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలిందని తెలిపారు. జైలుకు వెళ్లి వచ్చినా తీరు మార్చుకోకుండా పదేపదే నేరాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరస్థుడు కావడంతో, ఇతని కదలికలపై నిరంతరం నిఘా ఉంచేందుకు గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌లో ‘సస్పెక్ట్ షీట్ నెం. 111’ ను ఓపెన్ చేశామన్నారు.
ఆదిల్‌పై ఇప్పటి వరకు 5 గంజాయి కేసులు నమోదయ్యాయని, గతంలో అతని నుంచి 28 కిలోల గంజాయిని పట్టుకున్నామన్నారు.
ఇవే కాకుండా దొంగతనాలు, దాడులు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తనకు సంబంధించి మరో 5 క్రిమినల్ కేసులు ఇతనిపై ఉన్నాయని, గంజాయి మత్తులో యువత దొంగతనాలు, దోపిడీల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతు, తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు.
ఇలాంటి నేరస్థుల వల్ల సమాజానికి పొంచి ఉన్న ముప్పును వివరిస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపగా, ప్రభుత్వం ఆదిల్‌పై అత్యంత కఠినమైన ‘పిట్ ఎన్‌డిపిఎస్’ (పిట్ నిదప్స్ – యాక్ట్ ప్రెవేన్షన్ అఫ్ ఇల్లిసిట్ ట్రాఫిక్ ఇన్ నారకోటిక్ డ్రగ్స్ అండ్ సైకాట్రోపిక్ సబ్స్టాన్సెస్ యాక్ట్ , 1988) చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు.
అనంతరం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
జిల్లాలో మాదక ద్రవ్యాలు అమ్మినా, రవాణా చేసినా ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
గంజాయి అమ్మకాలపై ప్రజలకు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే డయల్-112 కు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) యం. వెంకటాద్రి , రాయచోటి డిఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్, వాయల్పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రాఘవ రెడ్డి, గుర్రంకొండ ఎస్ఐ, రవీంద్ర బాబు సిబ్బంది పాల్గొన్నారు.



