Uncategorized
పోలీసు జాగిలం “రాజ” అనారోగ్యంతో కన్నుమూత.

మదనపల్లి జిల్లా: రాయచోటి : వీఐపీ బందోబస్తు, పేలుడు పదార్థాల గుర్తింపులో విశేష సేవలందించిన మదనపల్లి జిల్లా పోలీసు జాగిలం “రాజ” (ల్యాబ్రడార్) అనారోగ్యంతో నేడు గురువారం కన్నుమూసింది. రాయచోటిలోని పాత పోలీసు క్వార్టర్స్ లో “రాజ” పార్థివ దేహానికి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్, పూలమాల వేసి నివాళులర్పించి, పోలీస్ శాఖకు “రాజ” అందించిన సేవలను కొనియాడారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు గౌరవప్రదంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో “రాజ” కు కడసారి వీడ్కోలు పలికిన రాయచోటి డీఎస్పీ, ఎం.ఆర్. కృష్ణమోహన్, సీఐలు చలపతి, రోషన్, కృష్ణంరాజు నాయక్, చాంద్ బాషా, ఆర్ఐ (అడ్మిన్) యు. రంగనాథ్ బాబు, ఎస్ఐ లు, డాగ్ స్క్వాడ్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



