“పే టాక్స్” పేరుతో వచ్చే సందేశాలపై అప్రమత్తంగా ఉండండి…. జిల్లా ఏస్పీ

చిత్తూరు జిల్లా: చిత్తూరు సూపర్ డెంట్ అఫ్ పోలీస్ కార్యాలయం లో నేడు గురువారం జిల్లా ఏస్పీ తుషార్ డూడి పత్రిక ప్రకటన లో మాట్లాడుతు…. “పే ట్యాక్స్ ఏపీకె ” ఫైళ్ల ద్వారా సైబర్ మోసాలు జరుగుతున్నాయని హెచ్చరించారు.
అనంతరం తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని, “ఏపీకె ” ఫైళ్లను ఇన్స్టాల్ చేయవద్దని సూచించారు.అలాగే సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్ కు కాల్ చేయాలని లేదా “సైబరక్రైమ్ .గవర్నమెంట్ .ఇన్” లో ఫిర్యాదు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం 18 సంవత్సరాల లోపు బాల బాలికలు బైక్ లు నడిపితే వాళ్ళ తల్లి తండ్రి పై పోలీస్ స్టేషన్ లో కేషు నమోదు చేస్తామని, అలాగే యువత గంజాయి, డ్రగ్స్, మద్యనికి బానిసలు అయి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దన్నారు.
అలాగే ద్విచక్ర వాహనం మరియు ఫోర్ వీలర్ లు నిదానంగా నడపాలని మరియు ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపకూడదన్నారు.
అనంతరం బైక్ లకు మరియు వాహనలకు తప్పనిసరిగా పొల్యూషన్, ఆర్ సి, ఉండాలని మరియు వాహనాలు నడిపేవాళ్లకు ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు.
అలాగే చిత్తూరు జిల్లా మండలల పోలీస్ స్టేషన్లలో రౌడీషిటర్ ఉన్న వాళ్ళు వచ్చే ఎన్నికల్లో చుట్టు పక్కల ఎక్కడ అల్లర్లు చేసిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయాన్నారు.
ఈ కార్యక్రమంలో… పోలీస్ అధికారులు పాల్గొన్నారు.



