రైల్వే కోడూరు టౌన్ పరిధిలో గంజాయి పరీక్షలు….. టౌన్ సీఐ.

తిరుపతి జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గం మరియు టౌన్ లో నేడు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సి. చంద్రశేఖర్ మీడియతో మాట్లాడుతు…. తిరుపతి జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ ( ఏ స్పీ ) ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్, ఆదేశాల మేరకు మరియు రేణిగుంట డీఎస్పీ, వై. శ్రీనివాసరావు పర్యవేక్షణలో నేడు శుక్రవారం రైల్వే కోడూరు టౌన్లో గంజాయి వినియోగంపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించమన్నారు.
ఈ సందర్భంగా చిట్వేల్ రోడ్లోని హాస్పిటల్ సమీపంలో గంజాయి టెస్ట్ కిట్లను ఉపయోగించి మొత్తం 210 మందికి గంజాయి పరీక్షలు నిర్వహించమని, అలాగే మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడంలో భాగంగా పోలీసులు ఈ ప్రత్యేక తనిఖీలను చేపట్టేమన్నారు.
(గంజాయి సరఫరా వ్యవస్థపై ప్రత్యేక నిఘా)…..గంజాయి వినియోగం, విక్రయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు పోలీసు సమాచారదారుల (ఇన్ఫర్మేంట్స్ ) వ్యవస్థను మరింత బలోపేతం చేశామన్నారు.
అనంతరం గంజాయి సరఫరా చేసే వ్యక్తులు, విక్రయదారులు, వినియోగదారుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నమన్నారు.
అలాగే ప్రజలు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, సరఫరాకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియజేసి సహకరించలన్నారు. సమాచారం అందించే వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
అలాగే యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే తీవ్రమైన అనర్థాలపై యువత, విద్యార్థులు మరియు ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నమన్నారు.
అనంతరం గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం, విక్రయం, అక్రమ సరఫరాకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో…. రైల్వే కోడూరు సబ్ ఇన్స్పెక్టర్ యల్. ప్రసాద్ రెడ్డి, మరియు ఏ యస్ ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్స్మరియు డాక్టర్ లు, నర్సులు పాల్గొన్నారు.



