Andhra Pradesh

పోలియో రహిత …ప్రపంచం గా మార్చుకోవాలి

కొయ్యలగూడెం : పోలియో రహిత ప్రపంచంగా తీర్చిదిద్దడానికి రోటరీ క్లబ్ కృషి చేస్తుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్. కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. మండలంలో రేపల్లెవాడ రోటరీ క్లబ్ ఫంక్షన్ హాల్ వద్ద బుధవారం క్లబ్ అధ్యక్షుడు మాదేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం రోటరీ ఇంటర్నేషనల్ పోలియో రహిత ప్రపంచంగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీ ప్రకారం 99. 9% పోలియో నిర్మూలన సాధించడం జరిగిందని అన్నారు. పోలియో నిర్మూలన కోసం అందరూ కలిసి పనిచేయాలని, రోటరీ ఇంటర్నేషనల్ తో పాటు, బిల్ గేట్స్ ఫౌండేషన్, వంటి స్వచ్ఛంద సంస్థల వారు అందరూ కలిసి పనిచేయడంతో 99.9% సాధించగలిగామని తెలిపారు. ఆఖరి మైలురాయి లో ఉన్న మనం ఏమాత్రం సడలింపు చూపించిన మరల మొదటి దశకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, తాను డిస్టిక్ గవర్నర్ గ ఉంటూ ఇచ్చాపురం నుండి విజయవాడ వరకు ఉన్న జిల్లాలలో సైకిల్ యాత్ర నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఫిబ్రవరి 19వ తేదీన ఇచ్చాపురంలో సైకిల్ యాత్ర ప్రారంభించి ఇప్పటికీ 900 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడం జరిగిందని అన్నారు. పోలియో రహిత ప్రపంచం కోసం కొయ్యలగూడెం రోటరీ క్లబ్ ద్వారా 60 వేల రూపాయలు చెక్కు రూపంలో క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన తనకు అందచేసారని కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ విశ్వనాథ శర్మ, క్యాంప్ చైర్మన్ చోడి పిండి సుబ్రహ్మణ్యం, మజ్జి సూరిబాబు, మద్దు గోపి, దారం సత్తిరాజు, గద్దె మోహన్ రావు, చిరవూరు సాయి, బొమ్మ దుర్గబాబు, సిరివెళ్ల సుబ్రహ్మణ్యం, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button