Ananthapuram

396 జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ఆర్డీవోకు లేఖరులు వినతి

కళ్యాణదుర్గం పట్టణంలో గత మూడు రోజులుగా రిజిస్ట్రేషన్ కార్యాలయం ముందు కళ్యాణదుర్గం లేఖరుల సంఘం నాయకులు 396 జీవోను రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఆర్డిఓ కార్యాలయం వద్దకు లేఖరులు వెళ్లి ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణను ఉపసంహరించు కోవాలన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు ఉపసంహరించుకోవాలన్నారు. 396 జీవోను వెంటనే రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button