Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Andhra Pradesh

అవినీతిని ఉపేక్షించం.. పేదవాడి ఆకలిపై రాజీ పడే ప్రసక్తే లేదు

రాజమండ్రి, మార్చి : ప్రభుత్వ రికార్డుల్లో అంకెలు కాదు.. ప్రజల ముఖాల్లో సంతృప్తి కనిపించాలి. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు” ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలు గంజిమాల దేవి గారు అధికారులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు రాజమండ్రిలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. “పేదవాడికి చేరాల్సిన ప్రతి గింజ పారదర్శకంగా పంపిణీ కావాలి. ఎక్కడైనా అక్రమాలు జరిగితే క్షేత్రస్థాయి అధికారులనే బాధ్యులను చేస్తాం” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా మధ్యాహ్న భోజనం మరియు అంగన్‌వాడీ పౌష్టికాహారం నాణ్యతపై రాజీ పడకూడదని, మెనూ అమలు చేయని పక్షంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button