నేరాలు నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా డ్రోన్ నిఘ…. జిల్లా ఏస్పీ

నెల్లూరు జిల్లా : నెల్లూరు పట్టణంలో మంగళవారం జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ డా. అజిత వేజెండ్ల ఐపీస్, ఆదేశాల మేరకు స్థానిక డిస్పీ ఆధ్వర్యంలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్లు మరియు సబ్ ఇన్స్పెక్టర్ల సమక్షంలో నేడు డ్రోన్ తో, నెల్లూరు పట్టణ, శివారు మరియు నెల్లూరు సిటీ ముఖ్య కూడళ్లు అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో రాత్రి డ్రోన్ నిఘా మరియు పెట్రోలింగ్ నిర్మానుష్యమైన ప్రదేశాల్లో క్షుణ్ణంగా పరిశీలించి, పట్టణ సమీప ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా అడ్డు కట్టు వేస్తున్న నెల్లూరు పోలీసులు.
అలాగే నేర నియంతరనే లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాల పై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా పెడుతున్నారు.
“బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్ స్నాచింగ్, రహదారి ప్రమాదాలు, దొంగతనాలు, రద్దీ ప్రాంతాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపడుతున్నారు.
నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశితమైన ప్రదేశాలను ముందుగా గుర్తించి, పాడుపడిపోయిన బంగ్లాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలను, పార్కులు, నదీ, సముద్రం తీరాలను ముందుగా గుర్తించి, ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి, నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎవరైన చట్ట వ్యతిరేక మరియు క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గంజాయి సేవించడం, అమ్మడం, రవాణా చేసే వారు పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
జిల్లాలో ఇకపై సాంకేతికతతో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రించుటకు వినూత్న చర్యలు తీసుకుంటున్న నెల్లూరు పోలీసులు. ఎవరికైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కి తెలపలన్నారు.



