అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన టాస్క్‌ఫోర్స్

తిరుపతి జిల్లా : తిరుపతి కపిలతిర్తం అటవీశాఖ టాస్క్ పోర్స్ కార్యాలయం లో నేడు మంగళవారం జిల్లా ఏస్పీ యల్. సుబ్బారాయుడు ఐపీస్, మీడియా సమావేశం లో మాట్లాడుతు….. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు, ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం “ఆర్ఎస్ఏఎస్టీఎఫ్” అదనపు ఎస్పీ జె. కులశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆపరేషన్లు నిరంతరం నిర్వహిస్తున్నమని, అదే విధంగా, ఎర్రచందనం కేసుల్లో ముద్దాయిలుగా ఉండి తప్పించుకొని తిరుగుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లను చట్టం ముందు నిలబెట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ క్రమంలో, నేడు తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ బృందం, అటవీ శాఖ సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించగా, ఈ సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని, అతని వద్ద నుంచి రెండు కార్లు, ఒక గూడ్స్ వాహనం సహా మొత్తం 76 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నమన్నారు.అలాగే మరో ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారు అవ్వగా,
అరెస్టు చేసిన వ్యక్తిని గతంలో ఎర్రచందనం కేసుల్లో ముద్దాయిగా ఉండి తప్పించుకొని తిరుగుతున్న కేరళ రాష్ట్రానికి చెందిన ప్రధాన అంతర్రాష్ట్ర స్మగ్లర్ నాసర్ కె.ఎన్ @ నాసర్ భాయిగా గుర్తించమన్నారు.అతను గత పదేళ్లుగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన కూలీల సహాయంతో శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలను నరికించి కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిందన్నారు. ఈ కేసులో స్వాధీనం చేసుకున్న 76 ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక గూడ్స్ వాహనం కలిపి మొత్తం విలువ సుమారు రూ.1.95 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారన్నారు.
ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో పాల్గొన్న ఇతర ప్రధాన సూత్రధారులను గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయని,
ఈ కేసులో అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ను అరెస్టు చేసి, భారీ మొత్తంలో ఎర్రచందనం దుంగలు, వాహనాలను స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ బృందాన్ని మేము ప్రత్యేకంగా అభినందించి రివార్డులు ప్రకటించమన్నారు.
భవిష్యత్తులో కూడా ఎర్రచందనం అక్రమ రవాణా నివారణకు, స్మగ్లింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.



