Telangana
బయ్యారంలో శాశ్వత ఆధార కేంద్రం ఏర్పాటు: ఎమ్మార్వో.

పల్లె వాణి బయ్యారం ఏప్రిల్ 22:బయ్యారం మండల ప్రజల సౌకర్యార్థం తహశీల్దార్ కార్యాలయం లో శాశ్వత ఆధార్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ఎమ్మార్వో నాగరాజు తెలిపారు.బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని నిర్వాహకురాలు ప్రేమలత, రెవిన్యూ ఇన్స్పెక్టర్ ఉపేందర్,సందీప్,వెంకన్న లతో కలిసి ఎమ్మార్వో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధార్ కు సంబంధించిన మార్పులు చేర్పులకై ఇక్కడ ఆధార్ నమోదు, నవీకరణ,ఫోటో అప్డేట్లు,మొబైల్ నంబర్ లింక్ వంటి సేవలను పొందవచ్చని తహశీల్దార్ తెలిపారు. ప్రజలు తమ ఆధార్-సంబంధిత పనులను ఇక్కడే పూర్తిచేయగలిగే అవకాశముందని తహశీల్దార్ తెలిపారు.ఆధార్ సేవల కోసం 6300165036 ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించాలన్నారు.ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.



