Andhra Pradesh

విద్యార్థులకు అవగాహన కార్యక్రమం….. యస్ ఐ, కె.సుజన్ కుమార్

తిరుపతి జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబుళవారి పల్లి మండల సబ్ ఇన్స్పెక్టర్ (యస్ ఐ ) కె. సుజన్ కుమార్ మాట్లాడుతు…. తిరుపతి జిల్లా ఏస్పీ, యల్. సుబ్బారాయుడు ఐపీస్ ఆదేశాలు మేరకు నేడు సోమవారం చిన్న ఒరంపాడు జూనియర్ కళాశాల మరియు రాళ్లచెరువు పల్లి లో విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరగాళ్లు మరియు చైన్ స్కాచింగ్ గురించి అవగాహనా కార్యక్రమం చేపట్టారు.
మహిళలు పల్లెటూరులో కాని పట్టణలలో కాని బయట తిరిగేటప్పుడు మరియు బస్సు లు ఎక్కెటప్పుడు మరియు మార్కెట్ కు వెళ్ళినప్పుడు మరియు జనం ఎక్కువ ఉన్న చోట మీరు పైట చెంగు నిండుగా కప్పుకోవాలన్నారు.
అలాగే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక విద్యార్థి డ్రైవింగ్ లైసెన్స్ తో,హెల్మెట్ వేసుకొని నిదానంగా బైక్ ని నడపాలని, అలాగే యువత మత్తు పదర్తలకు బానిసలుగా మారి, మి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోవద్దన్నారు.
అలాగే విద్యార్థినులు చిన్న వయస్సు లో ప్రేమ అంటు మగ పిల్లలతో అట్రాక్షన్ కు లోబడి వివాహలు చేసుకోకూడదన్నారు.
విద్యార్తిని విద్యార్థులార మి తల్లి తండ్రి కూలి పని చేసి, మిమ్మల్ని చదివిస్తున్నారు.
మీరు బాగా చదువుకొని మి తల్లి తండ్రి కి మరియు మన భారత దేశానికి మంచి పేరు తేవాలన్నారు.
ఈ కార్యక్రమంలో…. పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button