Telangana

గిరిజన పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి

పల్లె వాణి బయ్యారం,మార్చి 10:బయ్యారం మండలం లోని ఇర్సిలాపురం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను బయ్యారం మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు తనిఖీ చేశారు.మధ్యాహ్న సమయంలో పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.అనంతరం 10వ తరగతి విద్యార్థులతో సమావేశమై 60 డేస్ యాక్షన్ ప్లాన్ గురించి మాట్లాడారు.మార్చి 14వ తేదీ నుండి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షలు బాగా రాసి పాఠశాలకు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని సూచించారు.అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ ఉపాధ్యాయుల సూచనలను పాటించాలని అన్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం, హాస్టల్ సౌకర్యాలు, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్యా,వసతి సౌకర్యాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డా.బి.శోభన్ బాబు,సర్పంచ్ సరోజినీ,సెక్రటరీ ప్రియా,వార్డెన్ లాలయ్య,రవి,కృష్ణవేణి, కాంతారావు,పిడి వాలు,తులసీదాస్, వెంకటేశ్వర్లు,రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button