ఉపాధి కూలికి రు.312 పెంపు మరియు కూలీలకు 125 రోజులుగా పెంచిన కేంద్ర ప్రభుత్వం.

తిరుపతి జిల్లా: రైల్వే కోడూరు నియోజకవర్గం, ఓబుళవారిపల్లి మండలం, ముక్కావారిపల్లి లో నేడు గురువారం జరిగిన ( వి బి జి – రామ్ జి ) ప్రారంభోత్స కార్యక్రమనికి ముఖ్య అతిదులుగా కేంద్ర గ్రామీణభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనేదల పవణ్ కళ్యాణ్ మరియు (యన్ డి ఏ) కూటమి మంత్రులు, ఎమ్మెల్యే లు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి మరియు కడప (కూడా)చేర్మెన్ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో సభను జయప్రదం చేసి, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులను హిందూ సంప్రదాయ ప్రకారం వేద పండితులచే మహా కుర్ణం తొ స్వాగతం పలికేరు.
కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు నూతన ఉపాధి హామీ పథక కార్యక్రమనికి పూజలు చేసి, గడ్డపార, చెలంగపార లతో మట్టిని తవ్వి, ఉపాధి పనులకు శ్రీకారం చుట్టేరు.
ఆలాగే భారత దేశంలో ఉన్న ప్రతి ఒక గ్రామం లో ప్రతిఒక రోజు ఉపాధి వేతనాన్ని 312 రూపాయలుకు పెంచేరు.
అలాగే ఉపాధి పని దినాలను 125 రోజులుగా పెంచేరు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తూ, గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా “వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ (వీబీజీ రామ్ జి ) కార్యక్రమలు చేపట్టారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులకు (వీబీజీ రామ్ జి ) జాబ్ కార్డులు అందజేసి, (వీబీజీ రామ్ జి )సమాచార బుక్లెట్, కంపెండియం అఫ్ ఆర్టికల్స్ , మిషన్ పోర్టల్ లను ఆవిష్కరించారు.
“ఉపాధి కల్పనే పేదరిక నిర్మూలనకు మార్గం” అనే లక్ష్యంతో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అమలు చేస్తున్న ఈ మిషన్, గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ స్వర్ణాంధ్ర – వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక మైలురాయిగా నిలవనుందని,
అలాగే ప్రజల సంక్షేమమే లక్ష్యం… అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం మన్నారు.
అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేష్ ఐఏఎస్, గత పది రోజుల నుండి ( వీబీజీ రామ్ జి ) ప్రారంభోత్సవ సభ కార్యక్రమలను దగ్గర ఉండి చేసారు.
అలాగే జిల్లా సూపర్ డెంట్ అఫ్ పోలీస్ (ఏ స్పీ ) యల్ సుబ్బారాయిడు ఐపీస్, ఈ సభ కార్యక్రమంలో ఎలాంటి అవంచనియాలు జరగకుండా వెయ్యు మంది పోలీస్ బాలగాలు బందొబస్ట్ ని పెట్టి సభను విజయవంతం చేసేరు.
ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో సభకు వచ్చిన 50 వెలమంది కార్యకర్తలకు మంచినీళ్లు,, మజ్జిగ,, భోజన సౌకర్యలు కల్పించారు.
ఈ కార్యక్రమంలో…. యన్ డి ఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



