Telangana

దంతాలపల్లి మండలంలో గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్: ఎస్ఐ.

పల్లె వాణి మహబూబాబాద్ జిల్లా (దంతాలపల్లి మండలం) మే 29: దంతాలపల్లి మండలంలోని బిరిశెట్టి గూడెం వద్ద గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై రవికుమార్ తెలిపారు.బిరీ శెట్టి గూడెం గ్రామంలోని బస్టాండ్ వద్ద పెట్రోలింగ్ చేస్తూండగా ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అక్కడ అనుమానాస్పదంగా ఉన్న అదే గ్రామానికి చెందిన మిడతపల్లి నవీన్ S/o ఉప్పలయ్య అనే వ్యక్తి ని తనిఖీ చేయగా అతని వద్ద 500 గ్రాముల గంజాయి ఉన్నట్టు గుర్తించడం జరిగిందనీ, ఆ తదుపరి అట్టి వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని కేసు నమోదు చేసి ఈరోజు 29 నాడు కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించడం జరిగిందనీ ఎస్ఐ పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button